50 వేల ఈవీలు తయారు చేసిన టాటా మోటార్స్‌ 

50 వేల ఈవీలు తయారు చేసిన టాటా మోటార్స్‌ 

టాటా మోటార్స్ ఇప్పటి వరకు  50,000 ఈవీలను తయారు చేసింది. తమ 50,000 వ ఎలక్ట్రిక్ వెహికల్‌‌‌‌ను తమ పుణె ప్లాంట్‌‌లో  తయారు చేశామని టాటా మోటార్స్ ప్రకటించింది. దేశంలో  ఈవీ అడాప్షన్ పెరగడంలో కీలకంగా ఉన్నామని  కంపెనీ ప్యాసెంజర్ వెహికల్స్ ఎండీ శైలేష్‌‌ చంద్ర  ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొన్నారు.  కన్జూమర్లను ఆకర్షించడానికి వివిధ ఇనీషియేటివ్‌‌లను తెస్తున్నామని, నాణ్యమైన ప్రొడక్ట్‌‌లను అందిస్తున్నామని చెప్పారు. కస్టమర్లకు తక్కువ రేటులోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉండడానికి టాటా గ్రూప్‌‌ కంపెనీలతోనే ఓ ఈవీ ఎకోసిస్టమ్‌‌ను టాటా మోటార్స్ క్రియేట్ చేసింది.  50,000 వ ఈవీని తెస్తుండడం మార్కెట్‌‌లో తమ సామర్ధ్యానికి నిదర్శనంగా ఉందని చంద్ర పేర్కొన్నారు. పెరుగుతున్న  పెట్రోల్‌‌ ధరలను, కాలుష్యం సమస్యను పరిష్కరించడానికి ఈవీలు ప్రాక్టికల్ సొల్యూషన్లను అందిస్తున్నాయని అన్నారు.  ప్రస్తుతం  టాటా మోటార్స్ నాలుగు ఈవీ మోడల్స్‌‌ను అమ్ముతోంది. అవి టియాగో ఈవీ, నెక్సాన్‌‌ ఈవీ, టిగోర్ ఈవీ, ఎక్స్‌‌ప్రెస్ టీ.