'బుట్టబొమ్మ'  ట్రైలర్ వచ్చేసింది

'బుట్టబొమ్మ'  ట్రైలర్ వచ్చేసింది

అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా తెలుగులో నటించిన మొదటి సినిమా 'బుట్టబొమ్మ'. ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ వదిలారు. హీరో విశ్వక్ సేన్  ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. గ్రామీణస్థాయిలో ఉండే ప్రేమ కథగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సూర్య వశిష్ఠ, అనిఖ ప్రేమికులుగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ కనిపించనున్నాడు.

శౌరి  దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్నిసితార ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌‌ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, మిర్చి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.