రూ. 2వేల నోట్లు రద్దు..బంగారం దూకాణాలకు పెరిగిన క్యూ

రూ. 2వేల నోట్లు రద్దు..బంగారం దూకాణాలకు పెరిగిన క్యూ

రూ. 2 వేల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకోవడంతో దేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రజలు తమ దగ్గర ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తే జనాలు మాత్రం బంగారం షాపులకు పరిగెడుతున్నారు.  ఢిల్లీ, ముంబై, గుజరాత్లోని  సూరత్ తో పాటు...పలు నగరాల్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు పెరిగాయట.  మే 20వ తేదీ నుంచి ఢిల్లీలోని జువెల్లరీ దుకాణాలకు కస్టమర్లు క్యూ కట్టారు. ఎక్కువ డబ్బులు పెట్టి మరీ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా రూ. 2 వేల రూపాయల నోట్లతో  ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. 

రూ. 2వేల నోట్లతో బంగారం ఇస్తారా..

దేశంలోనే అనేక బంగారం దుకాణాలకు కస్టమర్లు వెళ్లి మరీ అడుగుతున్నారట.  రూ.2000 నోట్లతో బంగారం, వెండి కొనుగోళ్లకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. రూ.2000నోట్లతో బంగారం, వెండి కొనుగోలు చేయవచ్చా..? చేస్తే ఏమైన అధికంగా చెల్లించాలా..? అనే ఎంక్వైరీలు చాలా పెరిగాయని సమాచారం.  


క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు..
సాధారణంగా పెద్ద నోట్లను నగదు రూపంలో చలామణి చేయాల్సి ఉంటుంది. కానీ యూపీఐ పేమెంట్స్ వల్ల కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో డిజిటల్ రూపంలో లావాదేవీలు జరుపుతున్నారు.అందువల్ల రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రభావం బంగారం, ఆభరణాల వ్యాపారంపై పెద్దగా ఉండదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం తమ దగ్గర ఉన్న రూ. 2వేల నోట్లను మార్చేందుకు బంగారం షాపులకు వెళ్తున్నారు. దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారట. చాలామంది రిటైల్ జువెల్లరీ వ్యాపారులు రూ.2000 నోట్లపై బంగారాన్ని విక్రయించారని..,అది కూడా ఎక్కువ ధరకు విక్రయించారని తెలుస్తోంది. కస్టమర్లు కూడా అధికంగా చెల్లిస్తూ బంగారాన్ని కొంటున్నారట. మార్కెట్ ధరకన్నా 10 శాతం ఎక్కువ ధరకు అమ్ముతుండటంతో...10  గ్రాముల బర్రం ధర ప్రస్తుతం రూ.66,000 వేలకు చేరుకుంది.

కేవైసీ నిబంధనలు..

బంగారం వ్యాపారులు ప్రస్తుతం ఆదాయం పన్ను చెల్లింపుతో పాటు..మనీ లాండరింగ్ చట్టాలకు సంబంధించిన కెవైసి నిబంధనలను పాటిస్తూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. సాధారణంగా నోట్ల రద్దు సమయంలో ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం బంగారం కొనాలంటే  నిబంధనలు పాటించాల్సి ఉండడం వల్ల గతంలో మాదిరిగా కస్టమర్లు బంగారం కొంటలేరు. 2016లో రూ. 1000, రూ 500ల నోట్లను రద్దు చేసిన సమయంలో జనం ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థి లేదు. ఎందుకంటే ఆర్బీఐ 2018  నుంచే  రూ. 2 వేల నోట్ల ముద్రణను ఆపేసింది. 

రూ. 2వేల నోట్లను ఎక్కడ మార్చుకోవాలంటే..

రూ. 2000ల  నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.  దేశంలో రూ. 2వేల  నోట్ల జారీని నిలిపివేయాలని ఆర్బీఐ  బ్యాంకులకు సూచించింది. ఈ నోట్లు సెప్టెంబర్ 30 వరకు చలామణిలో ఉంటాయని..అప్పటిలోగా ప్రజలు వీటిని మార్చుకోవాలని సూచించింది.  మే 23 నుంచి బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది.