భారీగా తగ్గిందని వెండి కొంటున్నారా..? ముందు సిల్వర్ గురించి ఎవ్వరూ చెప్పని విషయాలు తెలుసుకోండి..

భారీగా తగ్గిందని వెండి కొంటున్నారా..? ముందు సిల్వర్ గురించి ఎవ్వరూ చెప్పని విషయాలు తెలుసుకోండి..

Silver Secrets: శనివారం ధనత్రయోదశి రోజున అనూహ్యంగా వెండి రేటు భారీ పతనాన్ని నమోదు చేసింది. గతవారం రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన వెండి ధరలు రెండు రోజుల నుంచి చల్లారుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ వెండి ఆభరణాలు, వస్తువులు షాపింగ్ చేసేవారు రేటుతో పాటుగా సిల్వర్ గురించి ఎవ్వరూ చెప్పని కొన్ని అంశాల గురించి ముందుగా తెలుసుకోవాల్సి ఉంది. 

ధనత్రయోదశికి ఎక్కువ మంది బంగారం కొంటుంటారు. దీనికి బదులు వెండి కూడా మంచిదేనని నమ్మకం ప్రజల్లో ఉంది. వెండిని భౌతికంగానే కాకుండా డిజిటల్ సిల్వర్, సిల్వర్ ఈటీఎఫ్స్ రూపంలో కూడా పెట్టుబడికి అనుకూలమే. 

వెండి కొనటానికి ముందు తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన అంశాలు..

* వెండి కొనటానికి ముందు దానిపై హాల్ మార్కింగ్ చెక్ చేసుకోవటం మంచిది. మీరు కొన్న వస్తువులు 925 స్టాంప్ కలిగి ఉన్నాయా అని గమనించాలి. కొందరు అధిక రేట్లు ఉండటంతో నకిలీలు, తక్కువ క్వాలిటీ లేదా సిల్వర్ ప్లేటింగ్ మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు పెరిగాయి. అందుకే సర్టిఫికేషన్ ఇస్తున్న పేరున్న సంస్థల్లో కొనటం ఉత్తమం. 
* వెండి సాధారణంగానే ఆక్సీకరణకు గురవుతుంది. దీంతో దీర్ఘకాలంలో రంగు నల్లగా మారుతుంది. 
*  బంగారం కంటే వెండి వస్తువులకు సాధారణంగా తయారీ మజూరీ ఖర్చులు అధికం. చాలా సంస్ధలు 10 శాతం నుంచి 25 శాతం వరకు మేకింగ్ చార్జీలు వేస్తుంటాయి. 
* వెండికి హాల్ మార్కింగ్ ఇటీవల ప్రారంభించబడింది. కొనేముందు ఇది వ్యాపారి ఇస్తున్నాడో లేదో గమనించండి.

ALSO READ : శుభవార్త.. భారీగానే పడిన గోల్డ్.. ఇవాళ కేజీకి రూ.17వేలు తగ్గిన వెండి..


* వెండిని తరచుగా శుభ్రపరచుకోవటం అవసరం. లేదంటే షైనింగ్ కోల్పోతాయి కాలక్రమేణా.
* ఆక్సీకరణ చేయబడిన వెండి స్వచ్ఛమైనది కాదు. ఇందుకోసం అనేక ఇతర లోహాలను కూడా అందులో కలుపుతుంటారు. ఇలాంటి వస్తువులు అందంగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో ఇలాంటి వస్తువులకు రేటు తగ్గే ప్రమాదం ఉంటుంది. 
* వెండి వస్తువుల తయారీలో తయారీ ఖర్చులను వ్యాపారులు కలపరు. దానిని విడిగా మేకింగ్ చార్జీలుగా వసూలు చేస్తారు. కాబట్టి తిరిగి అమ్మేటప్పుడు ఈ విలువను కోల్పోతారు. పైగా బంగారం లాగా వేగంగా వెండిని వ్యాపారులు కొనటం తక్కువ. మార్కెట్ రేట్ల కంటే తక్కువకు చాలా సార్లు ఆఫర్ చేస్తుంటారు చాలా సార్లు.