బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ జూనియర్‌‌ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌షిప్‌.. ఇండియాకు రెండో విజయం..

బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ జూనియర్‌‌ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌షిప్‌..  ఇండియాకు రెండో విజయం..

గువాహటి: బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ జూనియర్‌‌ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం (అక్టోబర్ 07) జరిగిన గ్రూప్‌‌–హెచ్‌‌లో ఇండియా 2–0 (45–27, 45–21)తో శ్రీలంకపై గెలిచి నాకౌట్‌‌ దశకు చేరువైంది. 

నేపాల్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో చాన్స్‌‌ లభించని ప్లేయర్లను ఈ పోరులో బరిలోకి దించారు. బాయ్స్‌‌ సింగిల్స్‌‌లో లాల్తాజువాలా హమర్‌‌ 9–2తో కెనెత్‌‌ అరుగోడాపై గెలిచి శుభారంభాన్నిచ్చాడు. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో భవ్యా చాబ్రా–మిథిలిష్‌‌ పి కృష్ణన్‌‌.. సనుదా అరియాసింఘే–తిసార్‌‌ రుపతుంగపై గెలిచి ఆధిక్యాన్ని 18–6కు పెంచారు. తొలిసారి రిలే ఫార్మాట్‌‌ ఆడుతున్న రక్షిత శ్రీ.. గర్ల్స్‌‌ సింగిల్స్‌‌ మ్యాచ్‌‌లో కాస్త తడబడింది. రంతిమా లియాంగేతో జరిగిన ఈ పోరులో ఆరంభంలో 3–8తో వెనుకబడ్డా తర్వాత పుంజుకుంది.

 ఫలితంగా ఆధిక్యాన్ని 36–21కు తీసుకెళ్లింది. బాయ్స్‌‌ డబుల్స్‌‌లో సి లాల్రామ్‌‌సంగా–తారిణి సూరి 9–6తో అరుగోడా–లియాంగేపై గెలిచి 45–27తో సెట్‌‌ను సొంతం చేసుకున్నారు. రెండో సెట్‌‌లో రౌనక్‌‌ చౌహాన్‌‌ అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. కొత్త లైనప్‌‌తో ఆడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా 45–21తో రెండో సెట్‌‌నూ గెలిచారు. ఇతర మ్యాచ్‌‌ల్లో జపాన్‌‌ 2–0తో ఐర్లాండ్‌‌పై, థాయ్‌‌లాండ్‌‌ 2–0తో పోర్చుగల్‌‌పై, ఫ్రాన్స్‌‌ 2–0తో ఈజిప్ట్‌‌పై గెలిచాయి.