దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. జూబ్లీహిల్స్‎తో పాటు ఉప ఎన్నికలు జరగనున్న స్థానాలు ఇవే

దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. జూబ్లీహిల్స్‎తో పాటు ఉప ఎన్నికలు జరగనున్న స్థానాలు ఇవే

న్యూఢిల్లీ: దేశంలోని 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన 8 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (అక్టోబర్ 6) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2025, నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. 2025, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీహార్‎లోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2025, నవంబర్ 6, 11వ తేదీల్లో బీహార్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. 

ఉప ఎన్నికలు జరగనున్న 8 అసెంబ్లీ స్థానాలు ఇవే:

  • జమ్మూ కాశ్మీర్‎: బుద్గాం, నగ్రోటా
  • తెలంగాణ: జూబ్లీహిల్స్
  • రాజస్థాన్: అంటా
  • జార్ఖండ్: ఘట్‎సిలా
  • పంజాబ్‎: తార్న్ తరణ్
  • మిజోరం: దంపా
  • ఒడిషా: నుపవాడా