రేణిగుంటలో ఘరానా దొంగలు అరెస్ట్​.. 41 బైక్​లు, రూ. 20 లక్షలు స్వాధీనం

రేణిగుంటలో ఘరానా దొంగలు అరెస్ట్​.. 41 బైక్​లు, రూ. 20 లక్షలు స్వాధీనం

తిరుపతి జిల్లా రేణిగుంటలో బైక్​ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 41 ద్విచక్రవాహనాలతో ఆటు రూ. 20.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.   వివరాల్లోకి వెళ్తే రేణిగుంటలో బైక్​ దొంగతనాలు పెరిగిపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెంచారు.  డీఎస్పీ భవ్య కిషోర్​ ఆధ్యర్యంలో  రెండు బృందాలు ప్రత్యేక టీంలుగా ఏర్పడి అనుమానాస్పద ప్రాంతాల్లో  మప్టీలో తిరుగుతూ పరిశీలిస్తున్నారు.  గోపాలపురం క్రాస్​ రోడ్​ లో తనిఖీలు నిర్వహిస్తుండగాముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు.

వీరికి గతంలో నేర చరిత్ర ఉందని తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రేణిగుంట పోలీస్​ స్టేషన్​ పరిధిలో 13, అలిపిరి పీఎస్​ పరిధిలో 12, కోడూరు ప్రాంతాల్లో పలు బైక్​ లు చోరీకి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు కోడూరు వాసులుగా నిర్దారించారు.  రేణిగుంట రైల్వే స్టేషన్​, అలిపిరి, కోడూరు ప్రాంతాల్లో పార్కింగ్​ చేసిన వాహనాలను చోరీచేసి తమిళనాడుకు చెందిన కరీం అనే వ్యక్తికి అమ్ముతున్నట్లు పోలీసులు చెప్పారు,  నిందితులు చెడు వ్యసనాలకు బానిసయి దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు.  బైక్​ దొంగలను పట్టుకున్న  రేణిగుంట డీఎస్పీ భవ్య కిషోర్​, సీఐ సుబ్బారెడ్డిని ఆయన అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు.  ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్నారు.