Bypoll Results 2023: ఉప ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇండియా, మూడు NDA..

Bypoll Results 2023: ఉప ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇండియా, మూడు NDA..

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగి ఉపఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటమి ఫలితాల్లో దాదాపు సమంగా సీట్లు సాధించాయి. ఇండియా కూటమి 4స్థానాలు, ఎన్డీయే 3 స్థానాలు గెలుచుకున్నాయి. సీపీఎం కంచుకోట అయిన త్రిపురలో రెండు అసెంబ్లీ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ధన్ పూర్, బోక్సానగర్లో సీపీఎం  అభ్యర్థులను ఓడించి బీజేపీ విజయ ఢంకా మోగించింది. మరోవైపు ఉత్తరా ఖండ్ లోని బాగేశ్వర్ లో కూడా బీజేపీ విజయం సాధించింది. 

ఇదిలా వుంటే యూపీలో ఘోసి లో అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కేరళలోని మాజీ సీఎం ఉమెన్ చాందీ కంచుకోట పుతుపల్లిలో కాంగ్రెస్ జెండా మరోసారి ఎగరేసింది. పుతుపల్లిలో ఉమెన్ చాందీ కుమారుడు చాంద్ ఉమెన్ గెలుపొందారు.     

పశ్చిమ బెంగాల్‌లోని ధుప్‌గురి అసెంబ్లీ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జార్ఖండ్‌లోని డుమ్రీలో జేఎంఎం అభ్యర్థి బేబీ దేవి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలో ఎన్డీయే కూటమికి 3 స్థానాలు, ఇండియా కూటమికి 4 స్థానాలు దక్కాయి.