దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్

దేశ వ్యాప్తంగా లోక్ సభ, శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. మొత్తం 3లోక్ సభ, 7 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏపీ లోని ఆత్మకూరులో బైపోల్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 12 రౌండ్లు పూర్తయ్యే సరికి 50 వేలకు పైగా ఓట్లతో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

అలాగే యూపీలోని రాంపుర్, ఆజాంగడ్ ఎంపీ స్థానాలతో పాటు పంజాబ్ లోని సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. త్రిపురలోని అగర్తల, జుబరాజ్ నగర్, సుర్మా, బర్దోవాలి నియోజకవర్గాలకు జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అలాగే జార్ఖండ్ లో మందార్, ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.