బాల్కసుమన్ గూండాగిరి.. బూతులు తిడుతూ పోలీసులకు వార్నింగ్

బాల్కసుమన్ గూండాగిరి.. బూతులు తిడుతూ పోలీసులకు వార్నింగ్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మంత్రి వివేక్,ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్ పై రాళ్ల దాడి చేసిన బాల్కసుమన్ బూతులతో రెచ్చిపోయారు. నోటికొచ్చినట్లు బూతులు తిట్టి గుండాల వ్యవహరించాడు. రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని..అపుడు మీ సంగతి చెప్తామంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవాలని ,అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

అంతకుముందు  మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణపై దాడిలో.. బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ స్వయంగా పాల్గొన్నారు. బాల్క సుమన్ రెచ్చగొట్టటమే కాదు.. బాల్క సుమనే స్వయంగా పోలీస్ బారికేడ్ ను మంత్రి, ఎంపీ కాన్వాయ్ పైకి విసిరేశాడు. పోలీసులు అడ్డుకుంటున్నా.. పోలీసులు వారిస్తున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా మంత్రి, ఎంపీ కార్లపై పోలీస్ బారికేడ్ లను విసిరేశాడు. 

మంత్రి, ఎంపీ కాన్వాయ్ పై రాళ్ల దాడిలో బాల్క సుమన్ స్వయంగా పాల్గొన్నటమే కాకుండా.. దగ్గరుండి మరీ రౌడీయిజం, గూండాగిరి చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాతనపల్లికి వస్తున్న మంత్రి, ఎంపీ కాన్వాయ్ పై దాడిలో కీలకమైన వ్యక్తి.. సూత్రదారి, పాత్రదారి అంతా బాల్క సుమన్ అని స్పష్టంగా విజువల్స్, ఫొటోలు చెబుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పటంతో.. పోలీసులు లాఠీచార్జి చేశారు.