జడ్చర్ల లో అభివృద్ధిని చూసి ఓటు వేయండి : లక్ష్మారెడ్డి

 జడ్చర్ల లో అభివృద్ధిని చూసి ఓటు వేయండి : లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు : నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేసి, తనను మరోసారి ఆశీర్వదించాలని జడ్చర్ల బీఆర్ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి కోరారు. జడ్చర్ల మున్సిపాల్టీలోని 25, 26వ  వార్డుల్లో ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. పలువురు ప్రముఖులను కలిసి మద్దతు కోరారు. తొమ్మిదేండ్ల కేసీఆర్  పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్  పాలనలో రైతుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్​ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్​దేనన్నారు. జడ్చర్లలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్  ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇక మున్సిపల్​ కౌన్సిలర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఎన్నికల ప్రచారం చేయగా, ఎమ్మెల్యే కొడుకు స్వరణ్​ రెడ్డి, కూతురు స్ఫూర్తిరెడ్డి వివిధ గ్రామాల్లో ప్రచారం చేశారు. మున్సిపల్​ చైర్ పర్సన్  దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కౌన్సిలర్లు శశికిరణ్, ఉమాశంకర్ గౌడ్, రఘురాంగౌడ్, కొండల్, జ్యోతి కృష్ణారెడ్డి, కోట్ల ప్రశాంత్​రెడ్డి, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇమ్ము, పర్వత్​రెడ్డి, సునీల్  పాల్గొన్నారు.