అరే నీచుడా : క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేశారని వెధవ ఫొటోలు పెట్టాడు

అరే నీచుడా : క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేశారని వెధవ ఫొటోలు పెట్టాడు

రైడ్ క్యాన్సిల్ చేసినందుకు బెంగళూరులో ఓ మహిళ క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆ మహిళ తనతో పాటు ఏడాది వయస్సు గల పిల్లవాడి కోసం క్యాబ్-రైడ్ బుక్ చేసిన సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే, డ్రైవర్ రాకముందే ఆమె రైడ్‌ను క్యాన్సిల్ చేసింది. దీంతో ఆగ్రహించిన క్యాబ్ డ్రైవర్.. ఆమెకు అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను పంపాడు.

ఈ ఘటన అనంతరం క్యాబ్‌ డ్రైవర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై యువతి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ తన బిడ్డతో కలిసి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 32 ఏళ్ల మహిళ తన కుమారుడిని తీసుకురావడానికి తన తొమ్మిది నెలల పసిపాపతో పాఠశాలకు వెళ్లింది. తన కూతురిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. రైడ్-షేరింగ్ అప్లికేషన్ ద్వారా క్యాబ్‌ను బుక్ చేసిన ఆమె.. రైడ్ కోసం వేచి చూసింది. అయితే అప్పుడే ఆ పాప ఏడవడం ప్రారంభించింది. దీంతో ఆ సమయంలో క్యాబ్ కోసం వేచి ఉండటం ఆమెకు కష్టమైంది. పది నిమిషాలు వేచి ఉన్న తర్వాత, ఆమె ఆటో రిక్షాను ఎంచుకుంది. రూ. 60 క్యాన్సిల్ పేమెంట్ చెల్లించి రైడ్‌ను రద్దు చేసింది.

ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ లైంగిక అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను ఆమె వాట్సాప్ నంబర్‌కు పంపాడు. అంతటితో ఆగకుండా అతను ఆమెకు నిరంతరం కాల్ చేస్తూ, మెసేజ్ లను చెక్ చేయమని కోరాడు. ఈ వేధింపులతో కుంగిపోయిన ఆ మహిళ.. ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని ఆ మహిళ తన బాధను పంచుకుంది. ఈ తరణంలో ఇరుగుపొరుగు వారు ఆమె ఫోన్‌ తీసుకుని డ్రైవర్‌కు ఫోన్‌ చేశారు. మెసేజ్ స్క్రీన్ షాట్ తమ వద్ద ఉందని వారు అతన్ని హెచ్చరించారు. దీంతో ఆ డ్రైవర్ వెంటనే తాను పంపించిన ఫైళ్లను తొలగించాడని, మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడైంది. ఈ కేసులో డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్ 354 ఏ, ఐటీ చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ALSO READ : Weather Tech : 48 గంటల ముందే ఎండా, వాన తెలిసిపోతుంది