రూపే డెబిట్ కార్డ్ వినియోగానికి ప్రోత్సాహకాలు

 రూపే డెబిట్ కార్డ్ వినియోగానికి ప్రోత్సాహకాలు
  • కేంద్ర కేబినెట్ నిర్ణయం

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ ను పెంచడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు సేవలు అందుకోలేనివారు, దిగువ పేద వర్గాల్లో డిజిటల్ లావాదేవీలు పెంచడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూపే డెబిట్ కార్డు వినియోగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. రూ. 2 వేల కంటే తక్కువ విలువైన లావాదేవీలకు భీమ్-యూపీఐ ఉపయోగించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ.1300 కోట్ల ఆర్ధిక భారం పడే అవకాశం ఉంది.