రైతులకు గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంచిన కేంద్రం

రైతులకు గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంచిన కేంద్రం

 కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో వరికి రూ. 69 మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో   క్వింటాల్ వరి మద్దతు ధర  రూ.2300 నుంచి రూ.2369  కి చేరింది.  కేంద్రం MSP కోసం  రూ. 2.70 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాకుండా రైతులకు వడ్డీ రాయితీ కింద  రూ.15,642 కోట్ల రూపాయలు కేటాయించింది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది.

►ALSO READ | ఉగ్ర ముల్లును పీకి పారేస్తం.. నేరుగా పోరాడే సత్తా లేక.. టెర్రరిజాన్నే వార్ స్ట్రాటజీగా పాక్ మార్చుకుంది

ప్రధాని మోదీ  అధ్యక్షతన  మే 28న భేటీ అయిన కేంద్ర కేబినెట్ 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) ఆమోదించింది కేంద్ర కేబినెట్. అలాగే  బద్వేలు నెల్లూరు హైవే 4 లైన్ల నిర్మాణం, వార్డా బళ్లార్ష హైవే 4 లైన్ల నిర్మాణం, రత్లాం నాగాడా హైవే 4 లైన్ల నిర్మాణం,రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వేషన్స్ స్కీంకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

14 ఖరీఫ్ పంటలకు కొత్త మద్దతు ధరలు

వరి సాధారణ  రకం రూ. 2369
గ్రేడ్ A  రూ.2389
జొన్నలు - హైబ్రిడ్ రూ.3699
పచ్చ జొన్నలు- మల్దండి  రూ. 3749
సజ్జలు రూ. 2775
రాగి రూ. 4886
మొక్కజొన్న రూ. 2400
పెసర్లు రూ. 8768
ఉప్పు రూ. 7800
నూనె విత్తనాలు
వేరుశనగ రూ. 7263
సన్‌ఫ్లవర్ విత్తనం రూ. 7721
సోయాబీన్ (పసుపు) రూ. 9846
నైజర్ విత్తనం రూ. 9537
వాణిజ్య
పత్తి (మధ్యస్థ రకం) రూ.7710
(పొడవైన రకం) రూ. 8110
పప్పులు
తుర్/అర్హార్  రూ. 8000
 

Cabinet approves Minimum Support Prices (MSP) for 14 Kharif Crops for Marketing Season 2025-26

The increase in MSP for Kharif Crops at a level of at least 1.5 times of the All-India weighted average cost of production

#CabinetDecisions pic.twitter.com/JXbkPXgRKB

— Dhirendra Ojha (@DG_PIB) May 28, 2025