యూపీలో చాక్లెట్లు ఎత్కపోయిన దొంగలు

యూపీలో చాక్లెట్లు ఎత్కపోయిన దొంగలు

లక్నో : యూపీలో వింత చోరీ జరిగింది. సాధారణంగా దొంగలు డబ్బులు, నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారు. కానీ ఆ దొంగలు చాక్లెట్లు ఎత్తుకుపోయారు. గౌడన్లో నిల్వ ఉంచిన లక్షల విలువైన చాక్లెట్లను ఖాళీ చేశారు. విషయం తెలుసుకున్న చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్ పోలీసులను ఆశ్రయించారు. 

లక్నోలోని చిన్హట్ ప్రాంతానికి చెందిన క్యాడ్బరీ చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్ స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. గోడౌన్గా ఉపయోగిస్తున్న ఆ ఇంటిలో దాదాపు రూ.17లక్షల ఖరీదు చేసే క్యాడ్బరీ చాక్లెట్లను నిల్వ చేశాడు. అయితే మంగళవారం తెల్లవారు జామున కొందరు దొంగలు గోడౌన్ తాళాలు పగలగొట్టి చాక్లెట్లను ఎత్తుకెళ్లారు. ఉదయం గోడౌన్ తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన పక్కింటి వారు యజమానికి సమాచారం అందించారు. అతను వచ్చి చూడగా.. ఒక్క చాక్లెట్ కూడా లేకుండా దొంగలు ఎత్తుకుపోయినట్లు గుర్తించాడు. దీనిపై చిన్హట్ పోలీసులకు ఫిర్యాదు చేయండతో వారు ఐపీసీ సెక్షన్ 380 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.