సీనియర్​పై సీఏఎఫ్​ కమాండర్ కాల్పులు.. ఇద్దరు మృతి

సీనియర్​పై సీఏఎఫ్​ కమాండర్ కాల్పులు.. ఇద్దరు మృతి
  • మరొకరికి మూడు బుల్లెట్ గాయాలు
  • చత్తీస్​గఢ్ లో ఘటన

రాయ్​పూర్: చత్తీస్ గఢ్ లోని నారాయణ్​పూర్ జిల్లాలో దారుణం జరిగింది. చత్తీస్​గఢ్ సాయుధ దళం(సీఏఎఫ్​) అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ తన సీనియర్ పై కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో తన సహచరులిద్దరు కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. 9వ బెటాలియన్ బీఎన్బీ కంపెనీకి చెందిన ప్లాటూన్ అసిస్టెంట్ కమాండర్ ఘనశ్యాం కుమేటి చిన్న వివాదం జరిగిన తర్వాత తన సర్వీస్ ఏకే 47 గన్​తో ముగ్గురు తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనలో ప్లాటూన్ కమాండర్ బిందేశ్వర్ సహాని, హెడ్ కానిస్టేబుల్ రామేశ్వర్ సాహు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ప్లాటూన్ కమాండర్ లచురామ్ ప్రీమికి మూడు బుల్లెట్ల గాయాలయ్యాయని చెప్పారు. ప్రీమిని రాయ్‌పూర్‌కు తరలించామని, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాయ్‌పూర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటోతోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమ్డై ఘాటి వద్ద ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగిందని, కుమేటీని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.