
న్యూఢిల్లీ: స్వీడిష్ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ సోమవారం భారతదేశంలో ట్రాన్స్‌క్రిప్షన్ కాల్ సమ్మరీని అందించే ఏఐ పవర్డ్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ట్రూకాలర్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అండ్రాయిడ్, ఐఓఎస్డివైజ్లలో పనిచేస్తుందని పేర్కొంది. ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్‌ను నేరుగా ట్రూకాలర్ యాప్‌లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్లో ఎదుటివాళ్లు ఏదైనా ముఖ్యమైన విషయం చెబితే నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
కాల్వివరాలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అక్షరాలుగానూ మార్చుకోవచ్చు. ఈ బ్రాండ్ ప్రీమియం ప్లాన్‌లో భాగంగా ఏఐ ఆధారిత కాల్ రికార్డింగ్ సొల్యూషన్ కోసం నెలకు రూ. 75 లేదా సంవత్సరానికి రూ. 529తో చెల్లించాలని ట్రూకాలర్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రిషిత్ జున్‌జున్‌వాలా చెప్పారు. ఫోన్‌లలో కాలర్ నేమ్ డిస్‌ప్లే కోసం సీఎన్ఏపీ సప్లిమెంటరీ సర్వీస్‌ను ప్రవేశపెట్టడంపై ట్రాయ్ శుక్రవారం సిఫార్సును విడుదల చేసింది. ట్రూకాలర్ ట్రాయ్‌కు మద్దతునిస్తుందని రిషిత్ పేర్కొన్నారు.