
సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కిరాలా రూపొందించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి నిర్మించిన సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం నాకు ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో క్రైమ్ స్టోరీతో పాటు లవ్ ట్రాక్, డార్క్ వెబ్ గురించి కూడా ఉంటుంది. ఇందులోని పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. డాలీషా చాలా కాంపిటీటివ్ కో ఆర్టిస్ట్. తనకొక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంది. శివ బాలాజీ ప్రెజెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఆయన పాత్ర చాలా సాఫ్ట్‌గా, డీసెంట్‌గా ఉంటుంది. ఇందులో రెండు పాటలు మాత్రమే ఉంటాయి.
ఒకటి లవ్ సాంగ్, మరొకటి బ్రేకప్ సాంగ్. థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ‘గాలోడు’ లాంటి కమర్షియల్ మూవీతో నాకు మాస్ ఇమేజ్ ఉందని అర్ధమైంది. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తే.. డిఫరెంట్ జానర్స్ ట్రై చేయొచ్చని తెలుస్తుంది. నా కెరీర్ అంతా ఆడియెన్స్‌పైనే ఆధారపడి ఉంది. నాకు అడివి శేష్ గారు చేసే సినిమాలంటే ఇష్టం. ఆయన చేసిన ఎవరు, క్షణం లాంటి జానర్స్ చేయాలనుంటుంది. ప్రస్తుతం ‘గోట్’ చిత్రంలో నటిస్తున్నా. మరికొన్ని కథలు విన్నా.. ఒకేసారి కాకుండా ఒకటి పూర్తయ్యాక మరొకటి మొదలుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నా’ అని చెప్పాడు.