NZ v AUS: ఆసీస్ ఆటగాడు భారీ సెంచరీ.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

NZ v AUS: ఆసీస్ ఆటగాడు భారీ సెంచరీ.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

2024 ఐపీఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. 2023లో గ్రీన్ ముంబై జట్టు తరపున ఆడాడు. 2022 ఐపీఎల్ వేలంలో 17.5 కోట్ల రికార్డ్ ధరకు గ్రీన్ ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. అయితే ట్రేడింగ్ ద్వారా ముంబై నుండి ఈ  ఆసీస్ ఆల్ రౌండర్ ను ఆర్సీబీ దక్కించుకుంది. దీంతో 2024 ఐపీఎల్ లో బెంగళూరు యాజమాన్యం ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కు 17.5 కోట్లు చెల్లించవలసి ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో అత్యంత ఖరీదైన ఆర్సీబీ ఆటగాడిగా ఈ సీజన్ బరిలోకి దిగుతున్నాడు. 

గ్రీన్ కు 17.5 కోట్లు చెల్లించడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఇతనిపై విమర్శలు గుప్పించారు. గ్రీన్ అంత మొత్తానికి అర్హుడు కాదని అన్నారు. అయితే ఇప్పుడు ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను చూసి అదే ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి టెస్టులో 275 బంతుల్లోనే 174 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టు మొత్తం కలిసి 168 పరుగులు చేస్తే గ్రీన్ ఒక్కడే 174 పరుగులు చేయడం విశేషం. మొత్తం 23 ఫోర్లతో పాటు 5 సిక్సర్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. ఈ సారి బెంగళూరు జట్టుకు గ్రీన్ తురుపు ముక్కగా మారే అవకాశముందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

లాకి ఫెర్గుసన్, ఆకాష్ దీప్ ఇటీవలే అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అదిరిపోయే ప్రదర్శన చేశారు. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టులో భాగంగా తన పదునైన పేస్ బౌలింగ్ తో టాపార్డర్ ను పెవిలియన్ కు పంపాడు. ఈ సిరీస్ లో ఫామ్ లో ఉన్న పోప్, క్రాలి, డకెట్  వికెట్లను తీసి తన డెబ్యూ మ్యాచ్ ను ఘనంగా చాటుకున్నాడు. మరోవైపు ఫెర్గుసన్ ఆస్ట్రేలియాపై జరిగిన రెండో టీ20 ల్లో అత్యద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. 3.5 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ALSO READ :- దివ్యాంగుల రిజర్వేషన్ ను 4శాతానికి పెంచిన ఘనత మోడీదే: కిషన్ రెడ్డి

ఈ ఏడాది ఈ కివీస్ పేస్ బౌలర్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్కసారి కూడా 30 కి పైగా పరుగులు సమర్పించుకోలేదు. దీంతో ఆర్సీబీ బౌలింగ్ చాల బలంగా తయారైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 22 న చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ జట్టు 2024 సీజన్ లో తొలి మ్యాచ్ ఆడబోతుంది. మరి ఈ ఆర్సీబీ ఆటగాళ్లు పీఎల్ లో కూడా ఇదే ప్రదర్శనతో తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తారో లేదో చూడాలి.