రొమ్ము క్యాన్సర్‌ను బ్రోకలీ నయం చేయగలదా? సర్వేలు ఏం చెప్తున్నాయంటే..

రొమ్ము క్యాన్సర్‌ను బ్రోకలీ నయం చేయగలదా? సర్వేలు ఏం చెప్తున్నాయంటే..

సల్ఫోరాఫేన్ అనేది బ్రోకలీ, ఇతర క్రూసిఫెరస్ కూరగాయలలో కనిపించే సహజమైన మొక్కల సమ్మేళనం, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రోజూ వారి ఆహారంలో బ్రోకలీని చేర్చడం వల్ల ఆరోగ్యానికి మంచిందని,  జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని ఓ కొత్త అధ్యయనం పేర్కొంది. అంతే కాదు ఇది రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుందని కూడా తెలిపింది.

బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ లేదా కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయలను ఎక్కువగా తీసుకునే స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని గతంలో జరిగిన అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. అటువంటి ఆహారాలలో అత్యధిక స్థాయిలో కనిపించే సల్ఫోరాఫేన్, క్యాన్సర్ కారకాలు వివిధ విధానాల ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని మాడ్యులేట్ చేయగలదని కూడా పరిశోధనలో తేలింది. ప్రత్యేకించి, సల్ఫోరాఫేన్ హిస్టోన్ డీసిటైలేస్‌లను లేదా HDACలను నిరోధిస్తుంది.

1. టమాటాలు

టమోటాలు రుచికరమైనవి మాత్రమే కాదు, పోషకమైనవి కూడా. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న టమాటా.. క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు కూడా సహకరిస్తుంది. టమాటాలో ఉండే లైకోపీన్‌, యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్, విటమిన్లు A, C,E ఉండడం వల్ల గుండె సంబంధిత వ్యాదులనూ సమర్థంగా ఎదుర్కునే సామర్థ్యం ఉంటుంది.

2. క్యాబేజీ

క్యాబేజీ చాలా మంది విస్తృతంగా ఉపయోగించకపోవచ్చు. కానీ, దీని వల్లా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. క్యాబేజీని ఉడికించి అనేక రుచికరమైన వంటకాలు చేయవచ్చు. ఇది శరీరంలోని క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. క్యాబేజీ.. రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు, మల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.