సర్కారు ఉందా లేదా?

సర్కారు ఉందా లేదా?
  • చిన్నారి రేప్, మర్డర్ జరిగి ఆరు రోజులైనా కేసీఆర్ ​మాట్లాడరా?: ప్రతిపక్ష నేతలు
  • ఇంత జరిగినా తండ్రీకొడుకులు ఫామ్​హౌస్​ దాటరా?: కోమటిరెడ్డి
  • బంగారు తెలంగాణను బార్ల తెలంగాణ చేసిన్రు: షర్మిల
  • ఇది సర్కారు ఫెయిల్యూరే: విజయమ్మ
  • అండగా ఉంట: పవన్ కల్యాణ్​​


చిన్నారి రేప్​, మర్డర్​ జరిగి ఆరు రోజులైనా కేసీఆర్, కాలనీని దత్తత తీసుకున్న కేటీఆర్ మాట్లాడకపోవడంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. కేసీఆర్​ సీఎం అయ్యాక రాష్ట్రంలో లైంగిక వేధింపుల కేసులు మూడింతలయ్యాయని విమర్శించారు.


హైదరాబాద్, వెలుగు: ‘డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో రాష్ట్రం జోగుతోంది. వ్యసనపరులకు టీఆర్​ఎస్​స్వర్గధామమైంది. రాష్ట్ర యువత మత్తుకు బానిసై దాడులు చేస్తున్నారు. నేషనల్​క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో నేరాల లిస్టులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సినీ నటులు డ్రగ్స్​వాడుతున్నారనే విచారణ కూడా జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఉందా అని అనుమానం కలుగుతోంది’ అని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. గాంధీభవన్​లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి నిందితుడు పట్టుబడ్డాడని మంత్రి కేటీఆర్​ ట్వీట్​చేశారని, 5 రోజుల తర్వాత దొరకలేదని పోలీసులు బహిరంగ ప్రకటన చేశారన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. సింగరేణి కాలనీని కేటీఆర్ ​దత్తత తీసుకున్నారని, ఇంతటి ఘోర ఘటన జరిగినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. హోం మంత్రి మహమూద్ అలీ ఇంటికి కూతవేటు దూరంలో సింగరేణి కాలనీ ఉందని.. కాలనీలో గంజాయి, గుడుంబా విచ్చలవిడిగా వాడుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
బెల్టు షాపులతో జనాన్ని తాగుబోతులు చేస్తున్నరు
రాష్ట్రంలో బెల్టు షాపులు పెట్టి జనాన్ని తాగుబోతులుగా మారుస్తున్నారని రేవంత్​ మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్​వాడకం కూడా విచ్చలవిడిగా సాగుతోందని.. సినీ నటుల డ్రగ్స్ వాడకంపై ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసిన విచారణ అధికారి అకున్​ సబర్వాల్​ను పక్కకు తప్పించారన్నారు. దీనిపై తాను కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కేసు వేశానని చెప్పారు. డ్రగ్స్​కేసులో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించట్లేదని కోర్డుకు ఈడీ చెప్పిందన్నారు. డ్రగ్స్ విచారణకు ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదో చెప్పాలని 
నిలదీశారు.