చైనా ఫోన్లతో మనం పోటీ పడగలమా?

చైనా ఫోన్లతో మనం పోటీ పడగలమా?

మనం ఎందుకు వెనుకబడుతున్నం?
ఫోన్ మార్కెట్లో దేశీ బ్రాండ్ల వాటా ఒకశాతమే
ఇవి సత్తా చాటాలంటే ప్రభుత్వ సాయం తప్పనిసరి

సరిహద్దుల్లో టెన్షన్స్ తర్వాత చైనా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్లను బ్యాన్ చేయాలనే డిమాండ్లు దేశం నలుమూలల నుంచి వస్తున్నాయి.

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో మన సైనికులతో ఘర్షణల తరువాత చైనా ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను బ్యాన్ చేయాలనే డిమాండ్లు దేశం నలుమూలల నుంచి వస్తున్నాయి. ఇండస్ట్రీ లాబీలు కూడా ఇదే వాదనతో ప్రభుత్వానికి లెటర్లు కూడా రాస్తున్నాయి. అన్నింటికంటే ముందు చైనా స్మార్ట్‌‌ఫోన్లను నిషేధించాలనే డిమాండ్ సామాన్య జనం నుంచి ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండియా స్మార్ట్‌‌ఫోన్‌‌ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. ఇందులో చైనా బ్రాండ్లకే 80 శాతానికిపైగా వాటా ఉంది. వీటికి బదులు దేశీ బ్రాండ్లు అయిన లావా, మైక్రోమ్యాక్స్, కార్బన్ ఫోన్లనే కొనాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అతి తక్కువ ధరలకు, మంచి హార్డ్‌‌వేర్, సాఫ్ట్‌‌వేర్‌‌‌‌తో ఫోన్లను అందించే చైనా కంపెనీలతో మన కంపెనీలు పోటీ పడగలవా ? అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. విదేశీ కంపెనీల మాదిరిగానే మైక్రోమ్యాక్స్ వంటివి కూడా ఆర్ అండ్ డీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీపై విపరీతంగా ఖర్చు చేయగలగాలి. ఇది జరగాలంటే వాటికి ప్రభుత్వం నుంచి సాయం అందాలి. దీనివల్ల చైనా వ్యతిరేకత వల్ల లోకల్ కంపెనీలు తప్పకుండా లాభపడతాయి.

మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాయ్…
చైనా వ్యతిరేకత పెల్లుబుకుతున్నందున, ఈ మూడు దేశీ కంపెనీలూ మళ్లీ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్‌‌కు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా ఫోన్ మార్కెట్‌‌ను చైనీస్ బ్రాండ్స్.. షావోమీ, రియల్ మీ, ఒప్పో, వివో శాసిస్తున్నాయి. రూ.10 వేలలోపు ధర గల ఫోన్లను తీసుకొస్తే మార్కెట్లో కొద్దిగా ఎదగొచ్చని దేశీ కంపెనీలు ఆశపడుతున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం ఈ ఏడాది జనవరి క్వార్టర్‌‌‌‌లో చైనీస్ ఫోన్ బ్రాండ్స్ వాటా 81 శాతం కాగా, మన కంపెనీల వాటా ఒక శాతానికే పరిమితమయింది. రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్​లో చైనా కంపెనీలతో ఇండియా సంస్థలు పోటీ పడలేకపోతున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తరుణ్ పాఠక్ అన్నారు. ఆర్ అండ్ డీపై ఖర్చును పెంచి, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను తయారు చేయగలిగితే లోకల్ బ్రాండ్లు కూడా సత్తా చాటొచ్చని చెప్పారు.

మన కంపెనీల సమస్యలు ఇవి
-ఇన్వెస్ట్‌‌మెంట్స్, మార్కెటింగ్, చానెల్ సపోర్ట్, ఆర్ అండ్ డీ, ఫోన్ సాఫ్ట్‌‌వేర్, హార్డ్‌‌వేర్ డెవలప్‌‌మెంట్, మాన్యుఫాక్చరింగ్.. ఇలా ఏ విషయంలోనూ చైనా కంపెనీలతో లోకల్ కంపెనీలు పోటీపడలేకపోతున్నాయి.
-ఫోన్ డిస్‌‌ప్లే, చార్జర్, కేబుల్స్ తయారు చేసే సదుపాయాలు, టెక్నాలజీ, వాల్యూ చెయిన్ ఇండియాలో లేదు. ఫోన్ డిజైనింగ్ సెంటర్లు కూడా మనదేశంలో లావాకు తప్ప మరే కంపెనీకి లేవు.
– విదేశీ కంపెనీల మాదిరిగానే లావా, మైక్రోమ్యాక్స్ వంటివి కూడా ఆర్ అండ్ డీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీపై విపరీతంగా ఖర్చు చేయగలగాలి. ఇది జరగాలంటే వాటికి గవర్నమెంటు నుంచి సాయం అందాలి.
-రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ (ఆర్ అండ్ డీ)పై చైనా బ్రాండ్లు విపరీతంగా ఖర్చు చేస్తూ సరికొత్త ఫీచర్లను ఇన్నోవేట్ చేస్తున్నాయి. మన కంపెనీలు కూడా ఆర్ అండ్ డీపై ఇన్వెస్ట్‌‌మెంట్ పెంచి, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను తయారు చేయగలిగితే సత్తా చాటవచ్చు.
-షావోవీ, రియల్​మీ మాదిరిగా తక్కువ ధరల్లో మంచి ఫీచర్లతో ఫోన్లను అందించడానికి ప్రభుత్వం మన కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తక్కువ వడ్డీరేట్లకు లోన్లు ఇవ్వాలి. లేకపోతే మార్కెటింగ్, చానెల్ సపోర్ట్ విషయంలో చైనా కంపెనీలతో తలపడటం అసాధ్యం.

For More News..

బ్రాండ్లకు దూరంగా సెలబ్రిటీలు