పిల్లల్ని బడికి పంపాలా? వద్దా?

పిల్లల్ని బడికి పంపాలా? వద్దా?

పిల్లలకి క్లాస్ రూమ్ అంటే మొబైల్ ఫోన్ స్క్రీన్ అన్నట్ టు గానే మారిపోయింది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ క్లాసులు పూర్తి స్థాయి క్లాస్ రూమ్ వాతావరణాన్ని తీసుకురాలేవు. ఒకపక్క రోజురోజుకీ కరోనా కేసుల ప్రభావం పెరిగిపోతూనే ఉంది. టీచర్లే కరోనా బారిన పడుతూ కూడా డ్యూటీలు చేస్తున్నారు.

కరోనా వల్ల ఏడేళ్ల పిల్లలనుంచీ 15 సంవత్సరాల పిల్లల మీద మానసికమైన ఒత్తిడి బలంగానే పడింది. పరీక్షలు లేకపోవటం మినహా మరే విషయంలోనూ పిల్లలకి సంతోషం లేదు. ఇప్పటికే పిల్లలు మళ్లీ స్కూల్ అనగానే కొంత గందరగోళంలో పడిపోయారు. ఒక పక్క కోవిడ్ భయం, రెండో పక్క ఆన్​లైన్​ క్లాసుల వల్ల ఎటూ అర్థం కాకుండా చదివిన సిలబస్. ఇలాంటి సిచ్యుయేషన్ లో పిల్లలు స్కూల్ కి రావాలి అంటే పేరెంట్స్​కి, టీచర్స్ కి, స్కూల్స్ లో ఉండే మిగతా స్టాఫ్ కీ కూడా అవేర్​నెస్ కల్పించటం అవసరం. 

 

కష్టాలు వచ్చినప్పుడు ఆగిపోవటం కన్నా వాటికి పరిష్కారాలని వెతుక్కుంటూ ముందుకు వెళ్లటమే మంచిది కానీ…!  ఇప్పుడున్న పరిస్థితి వేరు. పిల్లల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కష్టమే అందుకే ఏ రిస్క్ తీసుకోవటానికీ పేరెంట్స్ సిద్దంగా లేరు. ఇటువంటి స్థితిలో స్కూళ్లు తెరవడానికి ప్రభుత్వాలు రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు స్కూళ్లని తెరిచేశాయి.పిల్లలని కోవిడ్ కి దూరంగా ఉంచుతూనే వాళ్లని ప్రిపేర్ చెయ్యటం మొదలు పెట్టాయి.యూరోపియన్‌‌‌‌‌‌‌‌ దేశాల్లో మొట్టమొదటిగా డెన్మార్క్‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో స్కూళ్లు తెరిచింది. అక్కడ స్కూళ్లు పిల్లలను వీలైనంత తక్కువ ఉండేలా సెక్షన్లుగా విడగొట్టి క్లాసులునిర్వహిస్తున్నాయి.మే నెలలో స్కూళ్లు ప్రారంభించిన జపాన్‌‌‌‌‌‌‌‌ ఒక్కపూట తరగతులు నిర్వహించింది. పిల్లలు ఫిజికల్​ డిస్టెన్స్ పాటించేలా వాళ్లు కూర్చొనే సీట్ల మధ్య ఆరు అడుగుల దూరం తప్పనిసరి చేసింది. తరగతి గదిలో కూర్చునే ముందుగానే ప్రతి స్టూడెంట్​కీ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ చెక్ చేసేలా చర్యలు తీసుకుంది. అయితే…, ఈ పరిస్థితుల్లో పిల్లలని స్కూళ్లకి పంపాలా వద్దా అన్న డైలమాలో పేరెంట్స్ పడిపోయారు. అనుకోని పరిస్థితుల్లో పిల్లలకు వైరస్‌‌‌‌‌‌‌‌ సోకితే ఎలా? అసలు పిల్లలని ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఉంచటం స్కూల్ లో సాధ్యం అవుతుందా? పిల్లల ఆరోగ్య సంరక్షణ ఎలా? దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లిదండ్రులు, టీచర్లు అనారోగ్యం బారిన పడితే ఎలా?  స్కూల్ లో వెంటిలేషన్ ఉండేలా క్లాస్ రూంలు మార్చాలా? అనేక దేశాల్లో పేరెంట్స్, టీచర్లు ఎదుర్కొంటున్న ప్రశ్నలు. ఇదే విషయం మీద అమెరికాలోని ‘నేషనల్‌‌‌‌‌‌‌‌ అకాడెమీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మెడిసిన్‌‌‌‌‌‌‌‌ (NASEM) జులై 15న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో ఉన్న విషయాలేమిటంటే.

ఇంతకూ ఏం చేయాలంటే.. 

స్కూల్ స్టాఫ్ కచ్చితంగా శానిటైజ్డ్‌‌‌‌‌‌‌‌ మాస్క్‌‌‌‌‌‌‌‌లు పెట్టుకోవాలి. పర్సనల్ హైజీన్ పాటించాలి.

క్లాస్ రూమ్స్‌‌‌‌‌‌‌‌లో, డైనింగ్ హాల్స్‌‌‌‌‌‌‌‌లో, పిల్లలు గుంపులుగా చేరకుండా ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలి.

ప్రతి క్లాస్ రూంలో వీలైనంత తక్కువగా స్టూడెంట్స్ ని ఉంచాలి.

ప్రతి రోజూ స్కూలు మొత్తాన్ని శానిటైజ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ పాటించటానికి అవసరమైతే స్టాఫ్ ని పెంచాలి.

ఈ జాగ్రత్తలు అన్ని స్కూళ్లలో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్స్  సిద్ధం చేసుకోవాలి.

ఏదైనా ఎమర్జెన్సీలో స్టూడెంట్స్​కి తక్షణమే ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉండేలా చూసుకోవాలి.