నారింజ పండ్లతో పాటు తొక్కలనూ తినండి.. ఎందుకంటే

నారింజ పండ్లతో పాటు తొక్కలనూ తినండి.. ఎందుకంటే

కొన్ని పండ్లను తినడమే కాదు.. వాటి తొక్కలు కూడా ఆరోగ్యానికి, కొన్ని సార్లు శరీర సౌందర్యానికి మేలు చేస్తాయని నిపుణులు సైతం చెబుతుంటారు. ఉదాహరణకు అరటి, దానిమ్మ లాంటి తొక్కలను పొడి చేసి ముఖానికి పెడితే మంచి రంగు వస్తుందని అంటుంటారు. అదే తరహాలో నారింజ తొక్కలను కూడా తినొచ్చట. ఆరెంజ్ తొక్కలు కొంచెం చేదుగా ఉంటాయి. వీటిని సరైన మోతాదులో తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదట. అలా అని వాటిని పెద్ద మొత్తంలో తీసుకోవడం కూడా చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నారింజ తొక్కను మితంగా తీసుకోవడం సురక్షితం. వీటిని పెద్ద మొత్తంలో తినడం వల్ల కడుపు నొప్పి లాంటి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని డైటీషియన్స్ చెబుతున్నారు.

  • నారింజ తొక్కలను తినడానికి ముందు వాటిని బాగా కడగాలి.
  • విటమిన్లు C, A, పొటాషియం, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లతో సహా పండులో ఉండే అనేక ప్రయోజనాలను పీల్స్ కూడా కలిగి ఉంటాయి.
  • నారింజ పండుతో పోలిస్తే, దానిపై తొక్కలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
  • నారింజపై తొక్కలో పండులో కన్నా నాలుగు రెట్లు ఫైబర్, మూడు రెట్లు విటమిన్ సి, దాదాపు రెండు రెట్లు ఎక్కువ విటమిన్ ఎను కలిగి ఉంటుంది.
  • ఆరెంజ్ పీల్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొన్ని క్యాన్సర్ల నుంచి కూడా రక్షిస్తాయి.
  • క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు వారి రెగ్యులర్ డైట్‌లో భాగంగా సిట్రస్ పీల్ ను తీసుకోవచ్చు.
  • వీటిని తీసుకుంటే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 34% తక్కువగా ఉంటుంది.
  • నారింజ తొక్కలను ఆస్వాదించడం డెజర్ట్ సంస్కృతిలో కాలానుగుణమైన సంప్రదాయం.

ఇన్ని ఆరోగ్య ప్రయోదనాలున్న సిట్రస్ తొక్కలను పండుతో పాటు నిల్వ చేసుకోండి. వాటిని పారేయడం మానేసి, బదులుగా వాటిని తనడం అలవాటుగా చేసుకోండి.