దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని.. ఫొటోలు వైరల్

దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని.. ఫొటోలు వైరల్

నవంబర్ 7న ఒట్టావాలో జరిగిన దీపావళి వేడుకలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరయ్యారు. పార్లమెంట్ హిల్ వద్ద దీపాలు వెలిగించడం కోసం దేశంలోని ఇండియన్ కమ్యూనిటీతో కలిసి వచ్చారు. భారత్‌తో కెనడా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రూడో.. "ఈ వారం తర్వాత ప్రజలు దీపావళి, బండి చోర్ దివస్‌లను జరుపుకుంటారు. పార్లమెంట్ హిల్‌లో నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. ఈ వేడుకలు మనకు రాబోయే సంవత్సరానికి ఆశాజనకంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. దీపావళి శుభాకాంక్షలు.. బందీ చోర్ దివస్ శుభాకాంక్షలు" అని అన్నారాయన.

ఒట్టావాలో దీపావళి వేడుకలు:

పార్లమెంట్ హిల్ వద్ద దీపావళి వేడుకలు ఇండో-కెనడియన్ పార్లమెంటేరియన్ చంద్రశేఖర్ ఆర్య నేతృత్వంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఒట్టావా, గ్రేటర్ టొరంటో ఏరియా, మాంట్రియల్‌తో సహా వివిధ కెనడియన్ నగరాల నుంచి భారతీయులు పాల్గొన్నారు.