
న్యూఢిల్లీ: కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తన ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ. 100 నుంచి రూ. 106 మధ్య నిర్ణయించింది. అప్పర్ ఎండ్‌లో సుమారు రూ. 10 వేల కోట్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా చేసుకుంది.
ఈ ఇన్సూరెన్స్ కంపెనీ రూ. 2,516 కోట్ల పబ్లిక్ ఆఫరింగ్ అక్టోబర్ 10న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై అక్టోబర్ 14న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ అక్టోబర్ 9న ఒక రోజు పాటు ఉంటుంది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది కెనరా బ్యాంక్ (51 శాతం వాటా) హెచ్ఎస్బీసీ గ్రూప్‌కు చెందిన హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్ (ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ (26 శాతం వాటా) జాయింట్ వెంచర్.
కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ప్రమోటర్లు, పెట్టుబడిదారులు 23.75 కోట్ల షేర్లను అమ్ముతారు. కెనరా బ్యాంక్ 13.77 కోట్ల ఈక్విటీ షేర్లు (14.5 శాతం వాటా) విక్రయిస్తుంది.