డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కిరాయికి ఇస్తే పట్టా రద్దు : ఇంద్రకరణ్ రెడ్డి

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కిరాయికి ఇస్తే పట్టా రద్దు  : ఇంద్రకరణ్ రెడ్డి

 నిర్మల్, వెలుగు:  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను  కిరాయికి ఇచ్చినా అమ్మినా వారి పట్టాను రద్దు చేస్తామని  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బంగల్ పేట సమీపంలోని నాగనాయిపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను  లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మహిళల పేరు మీదనే కేటాయించిందన్నారు.  కరెంటు, తాగునీటి సమస్యలు ఎదురై తే  అధికారుల దృష్టికి తీసుకురావాలని, సొంతంగా రిపేర్లు చేసుకోవద్దన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాని వారికి సొంత స్థలం ఉంటే గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలను అందిస్తామన్నారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం డబుల్ బెడ్ రూ మ్ ప్రాంగణంలో 43 బ్లాకులు ఉన్నాయని, ప్రతి బ్లాకుకు  వార్డ్ మెంబర్ ను ఎన్నుకొని   సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలన్నారు.  కార్యక్ర మంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, లైబ్రరీ చైర్మన్  రాజేందర్, ఏఎంసీ చైర్మన్  రమణ, ఎఫ్ఎస్సీ ఎస్ చైర్మన్  రాజేందర్,  కౌ న్సిలర్లు  తదితరు లు పాల్గొన్నారు.