కేన్సర్ పాకిపోతోంది!

కేన్సర్ పాకిపోతోంది!

రాష్ట్రంలో రోజూ కొత్తగా 50 మంది బాధితులు
ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో పేషెంట్లు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
రెండే గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ కేన్సర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటళ్లు
రీజనల్ సెంటర్ల ఏర్పాటులో ఆలస్యం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగురాష్ట్రంలో కేన్సర్‌‌‌‌‌‌‌‌ పేషెంట్లు పెరుగుతున్నారు. సగటున రోజుకు 50 మంది కొత్తగా నమోదవుతున్నారు. ఇటీవల విడుదలైన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదికలోనూ ఇదే అంశం స్పష్టమైంది. ఒక్క పోయిన సంవత్సరమే13,130 మంది కామన్ కేన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఓరల్, సర్వికల్, బ్రెస్ట్ కేన్సర్లు) బాధితులను గుర్తించినట్టు నివేదిక వెల్లడించింది. ఇక లంగ్, ప్రొస్టేట్‌‌‌‌‌‌‌‌ తదితర కేన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధితుల సంఖ్య కలిపితే గత ఏడాది కేన్సర్ బారిన పడిన వారి సంఖ్య 18 వేలకు చేరుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు లక్ష మంది కేన్సర్ పేషెంట్లు ఉంటారని అంచనా. ప్రతి ఏడాది అదనంగా మరో 18 నుంచి 20 వేల మంది యాడ్ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్ సర్వేలో కేన్సర్ బాధితుల సంఖ్యనూ లెక్కిస్తున్నారు. ఒక్కో జిల్లాల్లో వందల సంఖ్యలో పేషెంట్లు బయటపడుతున్నారు.

రెండే హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే కేన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌లోని రీజినల్ కేన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లలోనే కేన్సర్ బాధితులకు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ తరఫున ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అందుతోంది. కొన్ని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం ఇచ్చే లిమిట్ దాటగానే ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆపేస్తున్నాయి. వరంగల్‌‌‌‌‌‌‌‌ రీజినల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పూర్తిస్థాయిలో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ లేదు. దీంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వరకూ రావాల్సిన పరిస్థితి. వచ్చినప్పుడల్లా పేషెంట్లు ఒకట్రెండు రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. ‘70% కేన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్లలో కీమోథెరపీ అవసరమవుతుందని, పేషెంట్ కండీషన్‌‌‌‌‌‌‌‌ను బట్టి మూడు వారాలకు ఒకసారి కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది.’ అని ఆంకాలజిస్ట్‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాం తెలిపారు. దీంతో కనీసం నెలకు ఒక్కసారైనా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు రావాల్సి ఉంటుంది. ఆర్థికంగా చితికిపోతున్న కేన్సర్ పేషెంట్లకు, రవాణా చార్జీలు అదనపు బారమవుతాయన్న ఉద్దేశ్యంతో ఆరోగ్యశ్రీ కింద రవాణా చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు రోజూ సుమారు 400 నుంచి 450 మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా, అందులో 40 నుంచి 60 మంది కొత్త వాళ్లుంటున్నారు. కొత్త వాళ్లకు బస్సు చార్జీలు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వదు. ఇప్పటికే రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న పేషెంట్లకే ఇస్తారు. అది కూడా డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిఫర్ చేసినప్పుడు వస్తే మాత్రమే. ఇలా రోజుకు రూ.20 వేలు పేషెంట్ల రవాణా చార్జీలకే చెల్లిస్తున్నామని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రకటనలకే పరిమితమైన రీజినల్ సెంటర్లు

జిల్లా కేంద్రాల్లో కేన్సర్ సెంటర్ల ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైంది. ప్రతి జిల్లా కేంద్రంలో కేన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రెండేండ్ల నుంచి అధికారులు,  నాయకులు చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకూ ఒక్క జిల్లాలోనూ ఏర్పాటు చేయలేదు. నేషనల్ హెల్త్ మిషన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా కేన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాలియేటీవ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకుంటే, రీజనల్ సెంటర్ల ఏర్పాటు పెద్ద కష్టమేమీ కాదని డాక్టర్లు చెప్తున్నారు.

రోజూ 20 వేల చార్జీలు చెల్లిస్తున్నం

దూరం నుంచి ఎంఎన్‌‌‌‌‌‌‌‌జేకు వచ్చే పేషెంట్లకు రోజుకు రూ.20 వేలు చార్జీల కింద చెల్లిస్తున్నం. ఫస్టు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నిధుల్లో నుంచి చెల్లించి, ఆరోగ్యశ్రీ నిధులు వచ్చాక తీసుకుంటున్నం.  60% మంది పేషెంట్లు రోగం ముదిరాక వస్తున్నారు. ముందే మేల్కొంటే రిజల్ట్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.

– డాక్టర్ జయలలిత, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే

మరిన్ని వార్తల కోసం