తొగుట (దుబ్బాక) వెలుగు: రోజు వారి జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో పట్టణ అభివృద్ధిపై రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక మున్సిపల్ పరిధిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణానికి, ప్రజలకు కలిగే నష్టాన్ని అవగాహన కల్పించాలన్నారు. అమృత్ స్కీమ్ కింద మంజూరైన నిధులతో టెండర్లు పిలిచి చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
