
హైదరాబాద్, వెలుగు: ఇటీవల విడుదల చేసిన నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్‌లో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. మంగళవారం బాధితులు సెక్రటేరియెట్‌కు వచ్చి దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. రిజల్ట్స్సమయంలో కటాఫ్ మార్కులను వెల్లడించలేదని, క్వాలిఫై మార్కులు ప్రకటించలేదని పేర్కొన్నారు. తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. అలాగే, కనీస అర్హత మార్కులు, క్వాలిఫై అయిన కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులకు వెయిటేజీ, జోన్లు, కులాల వారీగా కటాఫ్ వెల్లడించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.