హుస్నాబాద్లో గంజాయి పట్టివేత

హుస్నాబాద్లో గంజాయి పట్టివేత
  •     ఇద్దరు నిందితుల అరెస్టు
  •     ద్విచక్ర వాహనం, రెండు సెల్​ఫోన్లు సీజ్ 

హుస్నాబాద్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్​ కథనం ప్రకారం.. గంజాయి రవాణా అవుతోందనే పక్కా సమాచారం మేరకు సిద్దిపేట జిల్లా టాస్క్​ఫోర్స్​ పోలీసులు, హుస్నాబాద్​ పోలీసులతో కలిసి పట్టణ శివారులోని కరీంనగర్​ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సంచిలో ఉంచిన 1.500 గ్రాముల గంజాయి దొరికింది. 

వారి వివరాలు ఆరా తీయగా హుస్నాబాద్​కు చెందిన చుక్క అనిల్,  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డతండాకు గుగులోత్​సంతోష్ ​గా తెలిసింది. గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించగా తమకు వీర్లగడ్డతండాకు బూక్య రమేశ్​అమ్మాడని ఒప్పుకున్నారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని, టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనంతోపాటు రెండు సెల్​ఫోన్లను సీజ్​ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్​ రిమాండ్​కు తరలించారు.