
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తోన్న ముఠాను అరెస్ట్ చేశారు మాదాపూర్ ఎస్.ఓ.టి పోలీసులు. నిందితుల నుంచి దాదాపు 81కేజీల గంజాయి, కారు, ట్రాలీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నల్లగండ్ల వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా గంజాయి తరలిస్తున్న ముఠా పట్టుబడింది. పరుపుల మాటున గంజాయిని ట్రాలీలో వేసుకుని తరలిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సీజ్ చేసిన ప్రాపర్టీ విలువ 40లక్షల వరకు ఉంటుందన్నారు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి .
గుట్కా సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్
మహారాష్ట్ర, బీదర్ నుండి హైదరాబాద్ లో గుట్కా సరఫరా చేస్తున్న ముఠాను ఎల్ బి నగర్ ఎస్ ఓ టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడిపల్లి ,చెంగిచర్లలో భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడిన గుట్కా విలువ 20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
మాదాపూర్ జోన్ మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎల్ 2022 ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 10 లక్షల 15 వేల నగదు ,7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా ప్రధాన నిర్వాహకుడు రంగ కృష్ణ మూర్తి పరారయ్యాడు. కొన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
జలమండలి మేనేజర్, వర్క్ ఇన్‌స్టెక్టర్ సస్పెండ్
అప్పులు కట్టలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం
చైనాలోని 23 నగరాల్లో లాక్డౌన్..కఠిన ఆంక్షలు