మహిళలు తిరగబడి గద్దె దించే రోజు వస్తుంది

మహిళలు తిరగబడి గద్దె దించే రోజు వస్తుంది
  • రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితికి కారణం సీఎం కేసీఆర్
  • టీడీపీ మహిళా నేత,  ప్రొఫెసర్ జోస్న

హైదరాబాద్: రాత్రిపూట రోడ్డుపై వెళ్తుంటే దాహమేస్తే మంచినీళ్ల బాటిల్ దొరకదు కానీ.. మద్యం మాత్రం తప్పకుండా దొరుకుతుందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ప్రొఫెసర్ జోస్న అన్నారు. రాష్ట్రాన్ని ఇంతటి దౌర్భాగ్య పరిస్థితికి తెచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆమె ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేత,  ప్రొఫెసర్ జోస్న మాట్లాడుతూ ‘దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక మద్యం వినియోగించేది తమిళనాడులో.. స్టాక్ కూడా అదే స్థాయిలో పెట్టుకుంటారు.. కానీ.. అక్కడ మన దగ్గర ఉన్నంతటి భయానక పరిస్థితి లేదు.. దౌర్భాగ్య పరిస్థితి కూడా లేదు.. ఈ పరిస్థితికి తెచ్చిన వ్యక్తం సీఎం కేసీఆర్.. ఇది కేవలం రాజకీయంగా ఆయనను విమర్శించడానికో.. తిట్టడానికో చెప్పడం లేదు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చెబుతున్నా..వీటి మీద సమాజంగా మనం స్పందించాల్సిన అవసరం వచ్చింది’ అన్నారు. 
షాపులు పెట్టుకో.. ఆదాయం తెచ్చుకో కానీ..
షాపులు పెట్టుకో.. ఆదయాం తెచ్చుకో.. కానీ మద్యం షాపులు తగ్గించు.. ఎక్కడ పడితే అక్కడ.. గుడి లేదు.. బడి లేదు.. ఇళ్లలో సంసారాలు చేసుకుంటున్నారన్న ధ్యాసే లేదు.. ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు పెట్టేస్తున్నారు. దుకాణాలు పెట్టడానికో పద్ధతంటూ లేదు.. నా వద్ద పెద్ద టెక్నాలజీ వాడుతున్నా అని చెబుతున్న మంత్రి కేటీఆర్.. మద్యం దుకాణాలు ఎక్కడెక్కడ పెడుతున్నారు.. గుడికి.. బడికి..నివాసాలకు ఎంత దూరంలో మద్యం దుకాణాలుంటున్నాయో జియో ట్యాగింగ్ పెట్టుకుని తెలుసుకుని చూడలేని దుస్థితి మంత్రి కేటీఆర్ ది.. అని టీడీపీ మహిళా నేత,  ప్రొఫెసర్ జోస్న అన్నారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలందరూ నా అక్క, చెల్లెళ్లు అని అని చెప్పుకునే కేటీఆర్.. ఎంత మంది అమ్మాయిల మీద దాడులు.. అఘాయిత్యాలు జరిగినా స్పందించలేదు.. సిరిసిల్లలో.. నీ అనుచరుడు గిరిజన బాలిక మీద అత్యాచారం చేస్తే.. ఆదుకుంటానని చెప్పి వారిని కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికారంలో ఉన్న మంత్రి కేటీఆర్.. కేసీఆర్ స్పందిచడం లేదు కాబట్టే తాము ఈ పోరాటం చేపట్టామని టీడీపీ మహిళా నేత,  ప్రొఫెసర్ జోస్న తెలిపారు. 
ఇవాళ్టి రోజున అహంకారంతో మహిళలకు భద్రత కల్పించకుండా.. వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా... నా ఇష్టారాజ్యంగా అన్నట్లు వ్యవహరిస్తే... ఇదే మహిళలు తిరగబడి గద్దె దించేరోజు తొందర్లోనే వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇదేదో రాజకీయ విమర్శనో.. ప్రకటనో కాదు.. జరగబోయే వాస్తవమని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలమీద అవగాహన లేకుండా తిరుగుతున్న మీకు వాస్తవాలు తెలియజేస్తున్నాం.. ఇప్పటికైనా స్పందించాలని ప్రొఫెసర్ జోస్న డిమాండ్ చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి:

యూనివర్సిటీని టీఆర్ఎస్ భవన్ గా మార్చాలని  చూస్తున్నరు

ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదు.. కల్వకుంట్ల తెలంగాణ

8వేలకు కక్కుర్తిపడి 1.12 కోట్లతో పట్టుబడ్డ డాక్టర్