
హైదరాబాద్, వెలుగు: కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి ముగ్గురి పేర్లతో ప్రతిపాదనలు పంపించింది. దీంట్లో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా, వంశీ తిలక్, ఓంప్రకాశ్ పేర్లను పంపించినట్టు తెలిసింది. దీనిపై ఒకటీ రెండ్రోజుల్లోనే అధిష్టానం చర్చించి, అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కంటోన్మెంట్ టికెట్ ను కొప్పు బాషాకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉపఎన్నికలు వచ్చాయి.