హిందువుల ఐక్యతకు ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి : దిగంబర్‌

హిందువుల ఐక్యతకు ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి : దిగంబర్‌

ఆర్మూర్‌, వెలుగు: హిందువుల ఐక్యతను పెంపొందించేందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూర్‌ విభాగ కార్యవాహక్‌ దిగంబర్‌ తెలిపారు. శనివారం ఆర్మూర్‌లో పదసంచాలన్‌ నిర్వహించారు. టౌన్‌లోని జంబి హనుమాన్‌ మందిరం నుంచి పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌ మీదుగా పదసంచాలన్‌ కొనసాగింది. 

ఆర్మూర్‌ పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై పూల వర్షం కురిపించారు. అనంతరం జంబి హనుమాన్‌ మందిర ప్రాంగణంలో జరిగిన సభలో దిగంబర్‌ మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం హిందువులు కృషి చేయాలని సూచించారు. 

కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నగర ప్రముఖ్‌ పోల్కం నారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్‌, పెద్దోళ్ల గంగారెడ్డి, కోటపాటి నర్సింహ నాయుడు, చిల్క కిష్టయ్య, జెస్సు అనిల్‌, దయాసాగర్‌, బాలు పాల్గొన్నారు.