సదాశివనగర్, వెలుగు: ఎన్నికలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు శనివారం మాక్ పోలింగ్ నిర్వహించినట్లు శ్రీ సాయి విజ్జాన్ పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు ఎన్నికలపై అవగాహ కలిగి ఉండాలన్నారు.
ఎన్నికల ప్రక్రియను క్రమపద్ధతిలో నిర్వహించామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, ప్రచారం అనంతరం పోలింగ్, చివరగా ఫలితాలు ప్రకటించి అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
