కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. మందమర్రి, శ్రీరాంపూర్ సింగరేణి జీఎంల ఆఫీసులఎదుట కార్మికులతో కలిసి నేతలు ఆందోళనకు దిగారు. లీడర్లు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని డిమాండ్‌చేశారు.
ఇన్వాలిడేషన్అయిన కార్మికుల పిల్లందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నారు.150 మస్టర్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. మారుపేర్లతో ఉద్యోగాలు చేస్తున్నవారి సమస్యలను పరిష్కరించి విజిలెన్స్ ద్వారా విచారణ జరిపి పెండింగ్‌లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందజేశారు. మందమర్రిలో ఏఐటీయూసీ లీడర్లు ఎండీ అక్బర్అలీ, సత్యనారాయణ, మల్లేశ్, నర్సయ్య, శ్రీనివాస్, రాజేశం, తిరుపతి గౌడ్తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్‌లో లీడర్లు కొట్టె కిషన్ రావు, మోత్కూరి కొమురయ్య, చంద్రమోహన్, బుచ్చయ్య, నాగభూషణం, గండి సతీశ్, ప్రసాద్ రెడ్డి, గొర్రె నర్సయ్య, సారయ్య తదితరులు పాల్గొన్నారు.
