ఆర్మూర్ లో ముగిసిన సోషల్ వెల్ఫేర్ జోనల్ క్రీడలు

 ఆర్మూర్ లో ముగిసిన సోషల్ వెల్ఫేర్ జోనల్ క్రీడలు

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ శివారులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన సోషల్ వెల్ఫేర్ రెండో జోనల్ బాలుర క్రీడలు శనివారం  ముగిశాయి.  

ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ జిల్లా కన్వీనర్ మాధవిలత హాజరై విజేతలకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. బాసర జోన్ పరిధిలోని 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంస్థలకు చెందిన సుమారు 1200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. 

అండర్-14, అండర్-17, అండర్-19 వయో విభాగాల్లో వాలీబాల్, ఫుట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు  నిర్వహించారు.