టైం బాగోలేదు : స్టార్టప్ కంపెనీల్లో 51 శాతం తగ్గిన పెట్టుబడులు..

టైం బాగోలేదు : స్టార్టప్ కంపెనీల్లో 51 శాతం తగ్గిన పెట్టుబడులు..

స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు గతేడాది(2023) తో పోలిస్తే ఈ ఏడాది (2024) భారీగా తగ్గాయి. గత మూడు త్రైమాసికాల్లో స్టార్టప్ కంపెనీల్లో వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్టుబడులు..గతేడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2024 Q1 లో 51 శాతం తగ్గాయి.

ట్రాక్షిన్స్ జియో క్వార్టర్లీ ఇండియా టెక్ రిపోర్టు ప్రకారం.. 2024 మొదటి త్రైమాసికంలో స్టార్టప్ కంపెనీలకు 1.6బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.ఇది గత త్రైమాసిక అంటే 2023 నాలుగో క్వార్టర్స్ లో 2.2 బిలియన డాలర్లపెట్టుబడులు కంటే 27 శాతం తక్కువ. Q3లో 1.9 బిలియన్ డాలర్లు, Q2 లో 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 

2023 Q1 లో స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టిన 3.2 బిలియన్ డాలర్లనుంచి 2024 Q1 తగ్గుదల 51 శాతం కాగా ఫండింగ్ రౌండ్లు కూడా గత సంవత్సరం కంటే 2024 Q1  లో 432 నుంచి 48 శాతం క్షీణిం చాయి. 

ఈ త్రైమాసికంలో పెట్టుబడుల్లో కొంచెం తగ్గుముఖం కనిపించినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు, యువజనాభా ఉన్న భారత్ లో తిరిగి పెట్టుబడులు పుంచుకుంటాయని ట్రాక్షిన్ రిపోర్టులు చెబుతున్నాయి.  

ALSO READ | భారీ నష్టాల్లో టాటా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టర్లు