తల్లిని చంపిన హీరోయిన్…

తల్లిని చంపిన హీరోయిన్…

అమెరికా: హాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ తన తల్లిని హత్య చేసింది. ఈ ఘటన అమెరికాలోని కన్సస్ లో 2 జనవరి, 2020న జరిగింది. హత్య చేసిన హీరోయిన్ పేరు… మోలీ ఫిట్జర్లడ్(38). ఈమె ‘కెప్టెన్ అమెరికా: ఫస్ట్ అవెంజర్’ అనే సినిమాలో నటించింది. అయితే కాన్సస్ లో నివసిస్తున్న ఆమె తల్లి పాట్రిసియాని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సెకండ్ డిగ్రీ హత్యానేరం కింద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 2014లో వచ్చిన ‘ది లాఫుల్ ట్రూత్’ , 2017లో వచ్చిన ’ది క్రీప్స్’ లాంటి తక్కువ బడ్జెట్ సినిమాలలో నటించారు. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలువలేదు.