
ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. శుక్రవారం ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పీరియాడికల్ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. గురువారం అర్థరాత్రి జరిగిన ఈవెంట్‌కి సందీప్ కిషన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. దీంతో పాటు నెక్స్ట్ ధనుష్ అన్న దర్శకత్వం వహిస్తున్న ఆయన 50వ సినిమాలో నేను కూడా నటిస్తుండటం హ్యాపీగా ఉంది’ అన్నాడు.
డకాయిట్, హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్ (ధనుష్)ను పట్టుకోవడానికి ప్రకటించిన భారీ రివార్డ్ నోట్‌తో ప్రారంభమైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ధనుష్.. బ్రిలియంట్ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజీ త్యాగరాజన్ సమర్పణలో జి. శరవణన్ , సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్ 15న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.