కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి కొన ఊపిరితో బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 8న సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు మరో మొత్తం 14 మంది వెల్లింగ్టన్ వెళ్తుండగా కూనూరులో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో వరుణ్ సింగ్ మినహా మిగతావారందరూ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలతో బయటపడిన వరుణ్ సింగ్ ను వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించి.. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని కమాండ్ హాస్పిటల్‌ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన బుధవారం కన్నుమూసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.

వరుణ్ సింగ్ సేవలు మరువలేనివి

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు మరువలేనివని ప్రధాని మోడీ అన్నారు. ‘గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ గర్వంగా, పరాక్రమంతో మరియు అత్యంత నైపుణ్యంతో దేశానికి సేవ చేశాడు. ఆయన మృతి పట్ల నేను తీవ్ర వేదనకు లోనయ్యాను. దేశానికి ఆయన చేసిన గొప్ప సేవ ఎన్నటికీ మరువలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా సంతాపం. ఓం శాంతి’ అని మోడీ ట్వీట్ చేశారు.

For More News..

వీడియో: పల్లకి తెగి కిందపడిన కొత్త జంట

తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ

ఉప్పల్ స్టేడియానికి కరెంట్ నిలిపివేత