పంజాగుట్టలో కారు బీభత్సం..డ్రైవర్ ను చితకబాదిన స్థానికులు

పంజాగుట్టలో కారు బీభత్సం..డ్రైవర్ ను చితకబాదిన స్థానికులు

పంజాగుట్టలో కారు బీభత్సం సృష్టించింది. ఫుల్లుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి కారు నడుపుతూ భయాందోళనకు గురి చేశాడు. అడ్డు వచ్చిన వారిని ఢీకొడుతూ కారు డ్రైవ్ చేశాడు. అప్రమత్తమైన స్థానికులు కష్టం మీద కారును ఆపారు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.