ఘాట్‌ రోడ్డులో రెయిలింగ్‌ను ఢీకొట్టిన కారు

ఘాట్‌ రోడ్డులో రెయిలింగ్‌ను ఢీకొట్టిన కారు

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెద్ద ప్రమాదం తప్పింది. అలిపిరి సమీపంలోని వినాయక గుడి దగ్గర అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రొద్దుటూరు వాసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని రుయా హాస్పిటల్ కి తరలించారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులోని వాళ్లు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.