కారులోంచి మంటలు.. తప్పిన ప్రమాదం

కారులోంచి మంటలు.. తప్పిన ప్రమాదం
  • తాండూరులో ఘటన

వికారాబాద్, వెలుగు : తాండూరు టౌన్ లో కారులో నుంచి మంటలు చెలరేగాయి.  వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వచ్చి మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళ్తే... పట్టణంలోని జేబీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ కళ్యాణ్ కుమార్ తన కారు (టీఎస్ 04 ఈఎస్ 2300)లో కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి కొడంగల్ కు వెళ్లి అటునుంచి మంగళవారం తాండూరుకు వస్తున్నారు.

పట్టణంలోని ఫ్లై ఓవర్ వద్దకు రాగానే కారు ఆగిపోయింది. దీంతో మళ్లీ మళ్లీ స్టార్ట్ చేయడంతో బ్యాటరీ నుంచి మంటలు చెలరేగి వ్యాపించాయి. వెంటనే డాక్టర్ తో పాటు కుటుంబ సభ్యులు బయటకు దిగారు. ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.