ఓఆర్ఆర్ పై నుండి కింద పడ్డ కారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

ఓఆర్ఆర్ పై నుండి కింద పడ్డ కారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి.. రోడ్డు పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటన ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున మంచిరేవుల గ్రామం, ఫారెస్ట్ ట్రెక్ పార్క్ సమీపంలోని ఓఆర్ఆర్ పై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి  తరలించారు. 

ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగంగా కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.