ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ అంతా ఇంతా కాదు...VIP 0001 నంబర్ ఎంత ధర పలికిందో తెలుసా..

ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ అంతా ఇంతా కాదు...VIP 0001 నంబర్  ఎంత ధర పలికిందో తెలుసా..

మొబైల్ ఫోన్ నంబర్ తీసుకునేటప్పుడు చాలామంది ఫ్యాన్సీ నంబర్ కావాలని కోరుకుంటారు. అలాగే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఎక్కువగా రిపీట్ గా వచ్చే సంఖ్యలు కావాలని ఆశ పడతారు. ఇలా వాటికి అధికారులు వేలం నిర్వహిస్తుంటారు. వేలంలో ఒక వాహనదారుడు ఫ్యాన్సీ నంబర్ ను  12 లక్షల 70 వేల రూపాయిలకు  దక్కించుకున్నారు. దీనికి సంబంధిచి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరాఖండ్ లోని  రుద్రాపూర్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్38 VIP  కొత్త సిరీస్ ను ప్రారంభించారు.  ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ వారు కొన్ని నంబర్లను వేలం వేశారు. VIP 0001 రుద్రాపూర్ నివాసి కొనుగోలు చేశారు.   రుద్రాపూర్ నివాసి వైభవ్ ఛబ్రా  కారు ధర కంటే నంబర్ కోసం ఎక్కువ ఖర్చు చేశారు. డిపార్ట్‌మెంట్ జారీ చేసిన 0001 నంబర్‌ను 12 లక్షల 70 వేల రూపాయిలకు  కొనుగోలు చేశాడు. అలాగే మరో మూడు నంబర్లు కూడా లక్ష రూపాయలకు పైగా వేలంలో వాహనాల యజమానులు కొనుక్కున్నారని ...  రుద్రాపూర్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఏరియా  ఆర్టీవో పూజా నాయల్ తెలిపారు.

ఈ వేలంలో  0001 నంబర్‌ను  12 లక్షల 70 వేలకు వైభవ్ ఛబ్రా కొనుక్కున్నారని  20 వీఐపీ నంబర్ల వేలం అధికారి తెలిపారు. అదే సమయంలో మోహన్ లాల్ ఖేడా 0003 నంబర్‌కు  లక్ష 91 వేల రూపాయిలకు కొనుగోలు చేయగా..  నవీన్ చంద్ర బల్లభ్ 0009కి  లక్షా 5 వేలు, రాకేష్ సింగ్ 7777 నంబర్‌ లక్ష రూపాయిలు,  రాజీవ్ కటారియా 0002 నంబర్‌ 92 వేల రూపాయిలకు  వీఐపీ నంబర్లను  కొనుగోలు చేశారు.  20 వీఐపీ నంబర్లను వేలం వేయడం వల్ల శాఖకు ఆదాయం పెరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా మేము అదే విధంగా VIP నంబర్లను వేలం వేస్తామని ఆర్టీవో పూజా నాయల్ తెలిపారు

ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్

రుద్రాపూర్ RTO  నంబర్ సిరీస్‌ను మార్చారు.  ఆర్టీఓ కార్యాలయంలో వీఐపీ నంబర్లు వేలం వేశారు. ఈ బిడ్‌లో పాల్గొనేందుకు వచ్చిన వ్యక్తులు వీఐపీ నంబర్ల కోసం భారీ మొత్తం చెల్లించారు. రుద్రాపూర్ డివిజనల్ రవాణా శాఖ ఈ నంబర్ల వేలం ద్వారా అదనంగా ఆదాయం పొందింది.  RTO లో ప్రతి నెలా రెండుసార్లు VIP నంబర్‌లను వేలం వేస్తామని ఆర్టీవో పూజా నాయల్ చెప్పారు . మొదటి వేలం 8 నుంచి 10వ తేదీల మధ్యలో నిర్వహిస్తామని దీనికి  1వ తేదీ నుండి 7వ తేదీ వరకు రిజిష్ట్రేషన్ చేసుకోవాలని ...  రెండవ వేలం 23 నుండి 25 వరకు ఉంటుంది.. దీనికి  16 నుండి 22 వరకు రిజిష్ట్రేషన్ చేసుకోవాలని ఆర్టీవో అధికారి తెలిపారు.