- డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
గండిపేట,వెలుగు : పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై పిల్లర్ నంబర్ 170 వద్ద ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జ కాగా, డ్రైవర్తీవ్రంగా గాయపడ్డాడు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది.
కారు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో అర్ధరాత్రి అయినా చాలా దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఎయిర్పోర్ట్ కు వెళ్లేవారు, అత్యవసర పనులపై వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన చేరుకుని కారును పక్కకు తొలగించి రూట్క్లియర్చేశారు.
