మద్యం మత్తులో గొర్రెలపై దూసుకెళ్లిన కారు

మద్యం మత్తులో గొర్రెలపై దూసుకెళ్లిన కారు

 

వేములవాడ రూరల్, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్​ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు కారు నడుపుతూ గొర్రెలపైకి తీసుకెళ్లడంతో మూడు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలు గాయాలపాలయ్యాయి. నిజామాబాద్​ జిల్లా భీంగల్ కు చెందిన రమావత్  కిరణ్  తన అత్తగారింటికి మరికొంత మందితో వచ్చాడు. వారితో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఈ సంఘటన జరిగిందని ఎస్సై మారుతి తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్సై చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.