
హైదరాబాద్, వెలుగు: పాత కార్లను తిరిగి వాడుకునేలా చేసేందుకు రీఫర్బిష్‌డ్ ల్యాబ్‌ను ప్రారంభించామని ప్రీ-ఓన్డ్ వెహికల్స్ సెల్లర్ కార్స్24 ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో దీనిని 2.1 పైగా ఎకరాల్లో విస్తరించి నిర్మించింది. ఇక్కడ రోజుకు70కు పైగా కార్లను రీఫర్బిష్ చేస్తారు. దాదాపు 180 మందికి పైగా ఆటోమోటివ్ ఎక్స్‌పర్టులకు జాబ్స్ వస్తాయి. ఇది వరకే ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, అహ్మదాబాద్ చెన్నైలలోనూ రీఫర్బిష్‌డ్ ల్యాబ్స్‌ను మొదలుపెట్టింది. వీటివల్ల కస్టమర్లకు క్వాలిటీతో కూడిన ప్రీఓన్‌డ్ కార్లను అందించవచ్చని తెలిపింది. వెహికల్ నచ్చకుంటే ఎటువంటి ప్రశ్నలూ అడగకుండా వాపసు తీసుకుంటారు. ఆరు నెలల వారంటీ, డోర్‌స్టెప్ డెలివరీ, ఫైనాన్స్ వంటి ప్రయోజనాలూ ఉంటాయని కార్స్24 కో–ఫౌండర్ & సీఈఓ విక్రమ్ చోప్రా చెప్పారు. ‘‘పాత కార్లను పూర్తిగా చెక్ చేసి రీకండీషన్ చేస్తాం. కస్టమర్లకు చూపించేందుకు 360- డిగ్రీలలో ఫోటోలు తీసి ఉంచుతాం. ఫలితంగా కస్టమర్లకు క్వాలిటీ కార్లతోపాటు నమ్మకమైన, పారదర్శకమైన సేవలు అందుతాయి’’ అని ఆయన వివరించారు.